భార్యతో విడాకులు తీసుకున్నాకే గుత్తా జ్వాల పరిచయం అయింది: విష్ణు విశాల్

  • బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల ఇటీవలే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.
  • దక్షిణాది నటుడు విష్ణు విశాల్ తో తాను డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వెల్లడించింది.
  • గుత్తా జ్వాలకు ఇంతక్రితమే బ్యాడ్మింటన్ ఆటగాడు చేతన్ ఆనంద్ తో వివాహం జరగ్గా, కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు.
  • అటు విష్ణు విశాల్ సైతం కాస్ట్యూమ్ డిజైనర్ రజనీని పెళ్లాడి, ఆ తర్వాత విడిపోయారు. ఈ విషయంపై విష్ణు విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
  • గుత్తా జ్వాలతో ప్రేమ వ్యవహారం కారణంగానే తన కాపురంలో కలతలు వచ్చాయని ప్రచారం జరిగిందని, వాస్తవానికి రజనీతో విడాకుల తర్వాతే తనకు గుత్తా జ్వాల పరిచయం అయిందని స్పష్టం చేశారు.
  • విడాకుల తర్వాత ఎంతో మానసిక వేదనకు లోనైన సందర్భంలో జ్వాల తన జీవితంలోకి వచ్చిందని వివరించారు.
  • తన దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడానికి జ్వాల ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు.
  • అంతేకాకుండా, అమలాపాల్ ను కూడా ఈ వివాదంలోకి లాగారని, ఆమె కారణంగానే తన పెళ్లి విడాకుల వరకు వెళ్లిందని ప్రచారం చేశారని విష్ణు విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Source