ఏపీలో మరో 41 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ: ప్రభుత్వం ప్రకటన

  • ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో  మరో 41 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది.
  • ‘రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు జరిగిన కొవిడ్-19 పరీక్షల్లో గుంటూరులో 16, కృష్ణలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి.
  • కొత్తగా నమోదైన 34 కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473  కి పెరిగింది’ అని తెలిపింది.
  • రాష్ట్రంలోని  నమోదైన మొత్తం 473 పాజిటివ్ కేసులకు గాను 14 మంది డిశ్చార్జ్ కాగా, తొమ్మిది మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది.
  • మృతుల్లో అనంతపురం వాసులు ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు, కర్నూలుకు చెందిన ఒకరు, నెల్లూరులో ఒకరు ఉన్నారని చెప్పింది.
  • రాష్ట్రంలో గత 24 గంటల్లో  2,010 శాంపిళ్లను పరీక్షించగా 41 పాజిటివ్ గా నిర్దారించబడ్డాయని తెలిపింది.
  • కాగా, గుంటూరులో ఇప్పటివరకు అత్యధికంగా 109 మందికి కరోనా సోకింది. ఆసుపత్రుల్లో మొత్తం 450 మందికి చికిత్స అందుతోంది.
  • ఏయే జిల్లాలో ఎంత మందికి కరోనా..?

Source