అలాంటి వారితో సంబంధం తెంచుకోవడమే ఉత్తమం: షాలిని పాండే 

  • ‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే… బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.
  • దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో సైతం అవకాశాలను చేజిక్కించుకుని దూసుకుపోతోంది.
  • బాలీవుడ్ లో ఒకే సారి రెండు, మూడు సినిమాల్లో ఆమె అవకాశాలను చేజిక్కించుకుంది.
  • మరోవైపు, మన జీవితంపై ఆధిపత్యం చెలాయించే వారికి దూరంగా ఉండాలని షాలిని సూచిస్తోంది.
  • ఎవరైనా మనపై ఆధిపత్యాన్ని చెలాయిస్తే భరించలేమని షాలిని చెప్పింది.
  • మనపై ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వకూడదని తెలిపింది. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని… వారు మనకు ఎంత కావాల్సిన వారైనా సంబంధాలను తెంచుకోవడమే ఉత్తమమని చెప్పింది.
  • అలాంటి వారిని తాను ఒక్క క్షణం కూడా భరించలేనని… వారిని దూరంగా పెడతానని, లేకపోతే వారికి దూరంగా వెళ్లిపోతానని తెలిపింది.

Source