‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌటెలా

  • అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ ‘పుష్ప’ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ కథను ఫారిన్ నేపథ్యంలోను .. ‘రంగస్థలం’ కథను గ్రామీణ నేపథ్యంలోను నడిపించిన సుకుమార్, ‘పుష్ప’ కోసం అడవి నేపథ్యాన్ని ఎంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారు.
  • సుకుమార్ సినిమాల్లో కథాకథనాల విషయాన్ని పక్కన పెడితే, ఐటమ్ సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
  • ఆయన సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ దుమ్మురేపేస్తాయి .. మాస్ ఆడియన్స్ ను హుషారెత్తిస్తాయి.
  • అలాంటి స్పెషల్ సాంగ్ కోసం కైరా అద్వానితో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.
  • కానీ తాజాగా తెరపైకి ‘ఊర్వశి రౌటెలా’ పేరు వచ్చింది. ఆమె ఎంపిక ఖరారైపోయిందనే అంటున్నారు.
  • ఈ బాలీవుడ్ భామకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆమె తెలుగు తెరపై తొలిసారి కనిపించనుండటం, ఈ సినిమాకి కలిసొచ్చే అంశమేనని చెప్పొచ్చు.

Source