మధిర: నిబంధనలు గాలికి.. గెస్ట్‌హౌస్‌లో మందుపార్టీ చేసుకున్న కోవిడ్‌ అధికార బృందం!

  • కరోనా వైరస్ కట్టడి విధుల్లో ఉన్న అధికారులు కొందరు లాక్‌డౌన్ నిబంధనలు గాలికి వదిలేసి, భౌతిక దూరాన్ని అటకెక్కించేసి ఎంచక్కా మందుపార్టీ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిన్న రాత్రి జరిగిందీ ఘటన.
  • విషయం తెలిసిన మీడియా అక్కడికి వెళ్లడంతో చెరో దిక్కుకు పరుగులు తీశారు. ఓ అధికారి అయితే బాత్రూములో దూరి అరగంటకు పైగా అందులోనే ఉన్నారు. ఆ తర్వాత తలుపు తడితే తీసి పరుగో పరుగు.
  • ఇంతకీ ఏం జరిగిందంటే.. మండలస్థాయి అధికారులు 8 మంది కోవిడ్-19 విధుల్లో ఉంటూ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే భౌతికదూరం పాటించాలంటూ హోరెత్తిస్తున్నారు.
  • అయితే, విచిత్రంగా సోమవారం వీరంతా భౌతికదూరం నిబంధనను గాలికొదిలేసి మండల అధికారి విశ్రాంతి భవనంలో మందు పార్టీ చేసుకున్నారు.
  • సమాచారం అందుకున్న మీడియా అక్కడికి వెళ్లగానే తలో దిక్కుకు పరిగెత్తారు. ఓ అధికారి బాత్రూములో దూరి గడియపెట్టుకోగా, మిగిలినవారు గోడదూకి పరారయ్యారు. బాత్రూములో నక్కిన అధికారి కూడా అరగంట తర్వాత బయటకొచ్చి పరుగందుకున్నాడు.
  • మద్యం, మాంసం, ఇతర ఆహార పదార్థాలు అక్కడే వదిలేసి పరుగులు తీశారు. అంతేకాదు, అక్కడి వంట గదిలో ఖరీదైన మద్యం సీసాలు మరిన్ని కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు గెస్ట్ హౌస్‌కు చేరుకుని పరిశీలించారు.

Source