ఢిల్లీలో ముగ్గురు పోలీసులకు కరోనా.. డీసీపీ సహా 30 మంది పోలీసుల క్వారంటైన్

  • ఢిల్లీలో కరోనా విధుల్లో ఉన్న పోలీసులకు వైరస్ సోకడంతో 30 మంది పోలీసులు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.
  • ప్రస్తుతం దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య భయపెట్టేలా పెరుగుతోంది.
  • దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.
  • ఇప్పటి వరకు ఢిల్లీలో 1510 కేసులు నమోదు కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తాజాగా ఇద్దరు ఏఎస్ఐలతోపాటు ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితో సన్నిహితంగా మెలిగిన డీసీపీ సహా 30 మందిని ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ చేశారు.
  • కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 10,453 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 358 మంది ప్రాణాలు కోల్పోయారు.

Source