నయా బిజినెస్ లోకి టాలీవుడ్ హీరో మహేశ్ బాబు!

  • టాలీవుడ్ హీరో మహేశ్ బాబు, ఇప్పటికే సినిమా థియేటర్స్, టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
  • తాజాగా ఆయన డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యాపారంలోకి కూడా దిగబోతున్నారని సమాచారం.
  • ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
  • ఇటీవలి కాలంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) మీడియా సర్వీసెస్ వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
  • అల్లు అరవింద్ సైతం ‘ఆహా’ అనే పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు.
  • ఇక ఇప్పుడు మహేశ్ సైతం అదే రంగంలోకి దిగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Source