ఇద్దరు యువకులను కటకటాల్లోకి నెట్టిన టిక్‌టాక్ వీడియో!

  • టిక్‌టాక్ వీడియోల్లో కొంత వెరైటీ చూపించాలనుకున్న ఇద్దరు యువకులు జైలుపాలయ్యారు.
  • ఇంతకీ ఏ జరిగిందంటే.. హైదరాబాద్‌లోని ఈద్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు కుమార్‌ సంజూ, నితిన్‌ టిక్‌టాక్ వీడియోలు చేస్తుంటారు.
  • లాక్‌డౌన్ నేపథ్యంలో ఈసారి కొంత విభిన్నంగా వీడియోలు చేయాలని తలపోశారు. ఇందుకోసం మద్యాన్ని ఎంచుకున్నారు. మందుబాబులకు మద్యం పోస్తూ టిక్‌టాక్ వీడియోలు చేశారు.
  • అనంతరం ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇవి కాస్తా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టిలో పడ్డాయి.
  • వెంటనే స్పందించిన ఆయన లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించడంతోపాటు మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
  • మంత్రి ఆదేశాలతో యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Source