ఏపీలో ఏడుకు చేరిన మరణాలు.. 439కి పెరిగిన కేసులు

  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న కొత్తగా మరో 12 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 439కి పెరిగింది.
  • నిన్న కొత్తగా గుంటూరులో 4, నెల్లూరు 4, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెరోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
  • తాజా కేసులతో కలుపుకుని గుంటూరులో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 93కి పెరిగింది.
  • ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 93 కేసులు ఒక్క గుంటూరులోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో కర్నూలు (84) నెల్లూరు (56) ఉన్నాయి.
  • అత్యల్పంగా అనంతపురంలో 15 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Source