ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది: గంగూలీ

  • బీసీసీఐ అధ్యక్ష పదవిపై ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుందని సౌరవ్ గంగూలీ అన్నాడు.
  • బోర్డు చీఫ్‌గా ఇప్పటికే ఆరు నెలల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న గంగూలీ.. బోర్డు రాజ్యాంగం ప్రకారం మరో మూడు నెలలు మాత్రమే పదవిలో కొనసాగే అవకాశం ఉంది.
  • బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా రాష్ట్ర క్రికెట్ సంఘంలో కానీ, బీసీసీఐలో కానీ, లేదంటే రెండింట్లో కలుపుకుని ఆరేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి మూడేళ్లపాటు కచ్చితంగా విరామం తీసుకోవాల్సిందే.
  • బీసీసీఐ చీఫ్ కావడానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)లో సంయుక్త కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ‘దాదా’ మొత్తంగా ఐదు సంవత్సరాల మూడు నెలలు పనిచేశాడు. ఆ తర్వాత బీసీసీఐ చీఫ్ అయ్యాడు.
  • ఈ పదవిలో ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. అంటే గంగూలీకి మిగిలి వున్నది ఇక మూడు నెలలే.
  • అయితే, బీసీసీఐ చీఫ్‌గా పూర్తికాలం పనిచేసేందుకు వీలు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతూ ఇటీవల గంగూలీ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
  • ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కోర్టులు పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయం సందిగ్ధంలో పడింది.
  • తాజాగా ఈ విషయమై గంగూలీ మాట్లాడుతూ.. కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నాడు.
  • ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుందని, తమ చేతుల్లో ఏమీ లేదని స్పష్టం చేశాడు.

Source