తెలంగాణలో నిన్న ఒక్క రోజే 61 కేసుల నమోదు.. భయపెడుతున్న మహమ్మారి

  • తెలంగాణలో కరోనా వైరస్ భయపెడుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 61 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
  • ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇది రెండోసారి. గత వారం ఒక్క రోజే 75 కేసులు వెలుగుచూశాయి.
  • తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 592కు పెరిగింది. వీటిలో హైదరాబాద్‌లో నమోదైన కేసులే 267 ఉండడం గమనార్హం.
  • అలాగే, రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. 103 మంది కోలుకున్నారు.
  • తెలంగాణలో ఐదు జిల్లాల్లో మినహా 28 జిల్లాల్లో వైరస్ విస్తరించింది.
  • మరోవైపు వైరస్ తీవ్రంగా ఉన్న 246 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది.
  • 6,41,194 ఇళ్లలో ఇంటింటి సర్వే చేపట్టి 27,32,644 మందిని పరీక్షించింది.

Source