కరోనాపై పోరుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రూ. 5 కోట్ల విరాళం

  • మహమ్మారి కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చేయి కలిపారు.
  • స్వచ్ఛంద సంస్థ ‘గివ్ ఇండియా’కు రూ. 5 కోట్లు విరాళంగా అందించారు.
  • దేశంలో కరోనా కారణంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు గివ్ ఇండియా ఇప్పటికే రూ.12 కోట్లు సేకరించింది.
  • కాగా, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తల కోసం గూగుల్ గత నెలలో 800 మిలియన్ డాలర్లను ప్రకటించింది.

Source