నిజాముద్దీన్ తరహా మరో ఘటన..  తెలంగాణలో కలకలం!

  • కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న తరుణంలో నిజాముద్దీన్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
  • పాజిటివ్ కేసుల సంఖ్య ఉన్నట్టుండి రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఈ ఘటనను మరువక ముందే తెలంగాణను మరో ఘటన కుదిపేస్తోంది.
  • నిజాముద్దీన్ తరహాలోనే మరో ఉదంతం వెలుగు చూడటంతో అధికారులు హడలిపోతున్నారు.
  • వివరాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని దేవ్ బంద్ లో ఇటీవల జాతీయ మదర్సా సమ్మేళనం జరిగింది.
  • ఈ సమ్మేళనానికి వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో, పోలీసు శాఖ అప్రమత్తమైంది.
  • అక్కడకు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరించడంతో పాటు, వారిని గాలించే పనిలో పడింది.
  • ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి దాదాపు 100 మంది వరకు హాజరైనట్టు భావిస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కొందరిని గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Source