అమెరికాలో గంటకు ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?

  • కరోనా రక్కసి అమెరికాలో మరణమృదంగం మోగిస్తోంది. కరోనా కేసులతో సహా మృతుల సంఖ్యలో కూడా అగ్రరాజ్యం తొలి స్థానంలో ఉంది. ఈ మహమ్మారి దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.
  • నిన్న రాత్రి సమయానికి అమెరికాలో దాదాపు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ప్రతి గంటకు సుమారు 83 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది.
  • అమెరికాలో మరో ఐదున్నర లక్షల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
  • దేశ వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. 50 వేల మంది సైన్యాన్ని కరోనా కట్టడి విధులకు వినియోగిస్తున్నారు.

Source