సముద్రంలో పెరిగే ఈ నాచుతో కరోనాను కట్టడి చేయొచ్చు: రిలయన్స్ రీసర్చ్

  • ఇప్పుడు యావత్ ప్రపంచం ముందు ఉన్న పెను సవాలు కరోనా వైరస్ కు మందు కనుక్కోవడమే.
  • ఈ మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎప్పటిలోగా వ్యాక్సిన్ ను కనుక్కుంటారనే విషయాన్ని ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.
  • ఈ నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు ఓ కీలక విషయాన్ని కనిపెట్టారు.
  • సముద్రాల్లో ఉండే పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచుకు కరోనా ఇన్ఫెక్షన్లను నివారించే శక్తి ఉందని గుర్తించారు.
  • దీని నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాకరైడ్ లు శ్వాసకోస సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్ లకు బలమైన యాంటీ వైరల్ యాంటీ వైరల్ ఏజెంట్లుగా పని చేస్తాయని కనిపెట్టారు.
  • దీనికి సంబంధించి రిలయన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఓ అధ్యయన పత్రాన్నివిడుదల చేసింది.
  • ఈ నాచుతో యాంటీ వైరల్ ఔషధాలతో పాటు శానిటరీ ఉపకరణాలపై యాంటీ వైరల్ కోటింగ్ వేయవచ్చని అధ్యయన పత్రంలో వెల్లడించింది.
  • మరోవైపు కారోనా నిర్ధారణ పరీక్షల కిట్ల అభివృద్ధిపై కూడా రిలయన్స్ దృష్టి సారించింది.

Source