అదే నేను చేసిన పొరపాటు: హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్

  • తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు.
  • చాలా తక్కువ సమయంలోనే ఆమె పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ జోడీ కట్టే అవకాశాలను అందుకోగలిగింది.
  • అయితే ఆ సినిమాలతో పాటు ఆమె నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా పరాజయం పాలైంది. దాంతో సహజంగానే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
  • ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ .. “కెరియర్ తొలినాళ్లలో నాకు ఎలాంటి పాత్రలను ఎంచుకోవాలో తెలియలేదు. నా పాత్ర వరకే విని కథ మొత్తం వినని సందర్భాలు వున్నాయి.
  • కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడంలో పొరపాటు జరిగితే, మరికొన్ని ప్రాజెక్టులను వదులుకుని తప్పుచేశాను. ఇదంతా అనుభవలేమి వల్లనే జరిగింది.
  • అందువల్లనే ఇప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

Source