నా ప్రేమ రెండు సార్లు విఫలం కావడానికి కారణం ఇదే: నయనతార

  • వయసు పెరుగుతున్నా వెండి తెరపై నయనతార దూకుడు మాత్రం తగ్గడం లేదు. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదే సమయంలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ తో ఆమె ప్రేమలో ఉంది.
  • మరోవైపు, ఆమె జీవితంలో రెండు సార్లు ప్రేమ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ వైఫల్యాలపై ఆమె స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
  • ప్రేమ అంటేనే నమ్మకం అని… నమ్మకం లేని చోట ప్రేమ నిలవలేదని నయన్ తెలిపింది. ఒకరిపై మరొకరికి నమ్మకం లేనప్పుడు కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మేలని చెప్పింది. రెండు సార్లు తన ప్రేమ విఫలం కావడానికి ఇదే కారణమని తెలిపింది.
  • నమ్మకం లేకపోవడంతోనే వారితో బంధాన్ని తెంచుకున్నానని… ఆ సమయంలో ఎంత బాధ అనుభవించానో తనకు మాత్రమే తెలుసని చెప్పింది.
  • జనాలు మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు అనుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
  • ఆ బాధ నుంచి బయటకు రావడానికి తనకు చాలా కాలం పట్టిందని… సినిమాలే తనను మళ్లీ మనిషిని చేశాయని తెలిపింది.
  • కష్ట సమయంలో కూడా తన వెంట అభిమానులు ఉన్నారని కృతజ్ఞతలు తెలియజేసింది.

Source