లాక్‌డౌన్ పొడిగింపుపై నేడు స్పష్టత.. జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని

  • కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్ రేపటితో ముగియనుంది.
  • దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
  • ఆయా రాష్ట్రాల్లో కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించాలని పలువురు ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు.
  • అంతేకాదు, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి.
  • ఈ నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
  • లాక్‌డౌన్ పొడిగింపుపై వెలువడుతున్న ఊహాగానాలకు మోదీ చెక్ పెడతారని చెబుతున్నారు.
  • కాగా, కరోనాను కట్టడి చేసేందుకు దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలన్న యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచే దీనిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం.
  • ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసుల ఆధారంగా వాటికి జోన్లు కేటాయించాని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు.

Source