ముందే హెచ్చరించినా పట్టించుకోని ట్రంప్.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

  • కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన ఆ దేశంలో రోజూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇపటికే ఐదు లక్షల మందికి వైరస్ సోకింది.
  • వైరస్ వ్యాప్తిని అడ్డుకునే విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే అగ్రరాజ్యంలో అత్యధిక ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఫల్యం ఉందని చాలా మంది భావిస్తున్నారు.
  • ఈ వాదనకు మరింత బలం చేకూర్చేలా అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం సంచలనం రేకెత్తిస్తోంది.
  • కరోనా వ్యాప్తి గురించి అమెరికా అధికారులు ముందుగానే హెచ్చరించినా ట్రంప్ పట్టించులేదని, కేవలం ఆర్థిక వ్యవస్థపైనే దృష్టి సారించడం వల్లే దేశంలో పరిస్థితి చేయిదాటిపోయిందని ఆ పత్రిక పేర్కొన్నది.
  • కరోనా ప్రారంభ దశలోనే ఇంటలిజెన్స్‌, భద్రతా వర్గాలు, ఆరోగ్య శాఖ అధికారులు సైతం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ ట్రంప్ పెడచెవిన పెట్టారని న్యూయర్క్ టైమ్స్‌ చెప్పింది.

Source