న్యూయార్క్ విలవిల.. అమెరికాలోని మొత్తం మరణాల్లో సగం అక్కడే!

  • ప్రపంచంలోని మరే దేశంలోనూ లేనంతగా అమెరికాలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తోంది. మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ను ఛిన్నాభిన్నం చేస్తోంది.
  • అమెరికా వ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు, కేసుల్లో సగం ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
  • అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో న్యూయార్క్ నగరంలోనే అత్యధికం కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
  • అమెరికాలో 24 గంటల వ్యవధిలో 1514 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే ఇక్కడ 1920 మంది చనిపోగా, ఒక్క న్యూయార్క్‌లోనే 758 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారంతో పోలిస్తే ఆదివారం మరణాల సంఖ్య కొంత తగ్గింది.
  • తాజా మరణాలతో అమెరికా వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22,020కి చేరుకోగా ఇందులో దాదాపు సగం మరణాలు అంటే 9,385 మంది న్యూయార్క్‌లో సంభవించినవే కావడం గమనార్హం.
  • అలాగే, 5,59,409 మంది కరోనాతో పోరాడుతున్నారు. మరణాల్లోనూ, కేసుల్లోనూ అమెరికాదే అగ్రస్థానం.

Source