హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు.. 27,198 మందిపై కేసుల నమోదు

  • హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ఉల్లంఘనులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
  • కరోనా వైరస్ నగరాన్ని భయపెడుతున్నప్పటికీ జనం మాత్రం రోడ్లపైకి రావడం మానడం లేదు.
  • లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
  • లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 27,198 పెటీ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 785 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేశారు.
  • ఎఫ్ఐఆర్ నమోదైన కేసుల్లో గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Source