గ్రామ దేవత ఆదేశించిందట… ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన ప్రజలు!

  • కరోనా మహమ్మారి నుంచి గ్రామాన్ని కాపాడుకోవాలంటే, మూడు రోజుల పాటు ఎవరూ గ్రామంలో ఉండరాదని, ప్రతి ఒక్కరూ ఇంటి వైపు కూడా చూడకూడదని గ్రామదేవత చెప్పిందంటూ, కర్ణాటకలోని ఓ గ్రామమంతా ఖాళీచేసి వెళ్లిపోయింది.
  • ఈ ఘటన తుమకూరు జిల్లా ముద్దనహళ్లిలో చోటు చేసుకుంది. ఆ గ్రామ దేవత మారమ్మదేవి, ఓ మహిళకు పూని భవిష్యవాణి చెబుతూ ఉంటుంది. తాజాగా, ఈ భవిష్యవాణిలో కరోనా ప్రమాదం పొంచివుందని చెప్పింది.
  • దీన్ని నమ్మిన ఊరి ప్రజలు, గ్రామానికి వెళ్లే దారిని మూసివేసి, ఊరి చివరి పొలాల్లో చిన్న చిన్న డేరాలు వేసుకుని, వాటిల్లో ఉంటున్నారు.
  • తమతమ పశువులను కూడా అక్కడికి తరలించడంతో గ్రామమంతా నిర్మానుష్యంగా మారింది.

Source