నేను కరోనాతో వచ్చాను.. ఈ డబ్బు తీసుకోండి: ఇంటి ముందు డబ్బు పెట్టి మాయమవుతున్న ఆగంతుకుడు

  • బీహార్‌లో పొద్దున్నే ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్న కరెన్సీ నోట్లు స్థానికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
  • సహస్ర పట్టణంలో గత నాలుగు రోజులుగా ఇళ్ల గుమ్మాల ముందు రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు దర్శనమిస్తున్నాయి. వాటితోపాటు ఓ చీటీ కూడా ఉంటోంది.
  • అందులో తాను కరోనాతో వచ్చానని, తాను పెట్టిన ఈ నోట్లను స్వీకరించాలని, లేదంటే ప్రతి ఒక్కరినీ వేధిస్తానని అందులో రాసి ఉంది.
  • దీంతో భయపడుతున్న స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ముగ్గురి ఇంటి ముందు ఇలా కరెన్సీ నోట్లు లభించాయని, చీటీలోని చేతిరాత ప్రకారం ఈ పనికి పాల్పడుతున్నది ఒక్కరేనని అనుమానిస్తున్నారు.
  • జనాన్ని ఆటపట్టించేందుకే అతడు ఇలా చేస్తుండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Source