ఏపీలో 427కు పెరిగిన కరోనా కేసులు.. గుంటూరులో ఒకరి మృతి

  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్కడ ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
  • నిన్న కొత్తగా మరో 22 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 427కు చేరుకుంది.
  • నిన్న గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు, కడప జిల్లాలో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి.
  • అలాగే, కరోనా బారినపడి గుంటూరులో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లాలోని దాచేపల్లికి చెందిన బాధితుడు శ్వాస సంబంధిత సమస్యలతో ఈ నెల 9న పిడుగురాళ్ల ఆసుపత్రిలో చేరాడు.
  • పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరులోని ఐడీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అతడి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
  • అతడు పదో తేదీ అర్ధరాత్రి దాటాక 1:30 సమయంలో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది.
  • 65 ఏళ్ల వృద్ధుడు ఒకరు కోలుకుని విజయవాడ జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12కి చేరింది.
  • కాగా, గుంటూరులో అత్యధికంగా 89 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో కర్నూలు (84), నెల్లూరు (52) ఉన్నాయి. అనంతపురంలో అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి.

Source