ఆర్మీ అధికారి చనిపోతే ఇంత ఘోరమా?

  • ఆర్మీ అధికారిగా సేవ‌లందిస్తోన్న త‌న కుమారుడిని క‌డ‌చూపు చూడాల‌ని ఆ త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోయారు. అందుకోసం ఏకంగా 2,600 కి.మీ ప్ర‌యాణించారు.
  • వివ‌రాలు.. ప్ర‌తిష్టాత్మ‌క శౌర్య‌చ‌క్ర పుర‌స్కార గ్ర‌హీత‌ న‌వ‌జోత్ సింగ్ ఆర్మీ ప్ర‌త్యేక ద‌ళాల విభాగంలో ప‌ని చేస్తున్నారు. క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఆయ‌న గురు‌వారం బెంగుళూరులో క‌న్నుమూశారు.
  • అయితే ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న తమ తల్లిదండ్రులు బెంగళూరు రావడానికి ఏర్పాట్లు చేయాలని ఆ అధి​కారి సోదరుడు నవతేజ్‌ సింగ్‌ బాల్‌ కోరారు.
  • లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందును తాము రావడానికి ఏర్పాట్లు చేయాలని విన్నవించారు.
  • అయితే దీనికి ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వ‌ని, ఈ విష‌యంలో తాము ఎలాంటి స‌హాయం చేయ‌లేమంటూ అధికారులు చేతులెత్తేశారు.
  • దీంతో చేసేదేం లేక క‌ల్న‌ల్ కుటుంబ స‌భ్యులు రోడ్డు మార్గంలో కారులో ప్ర‌యాణం మొద‌లు పెట్టారు.
  • ఈ ప్ర‌యాణానికి సంబంధించిన వివ‌రాల‌ను క‌ల్న‌ల్ సోద‌రుడు నవతేజ్‌ సింగ్‌ సోష‌ల్ మీడియాలో వివ‌రిస్తూ వ‌చ్చారు.
  • ఈ విష‌యం గురించి మాజీ ఆర్మీ అధికారి వీపీ జ‌న‌ర‌ల్ ట్విటర్‌లో స్పందిస్తూ.. “నా ప్ర‌గాఢ సానుభూతి. క్షేమంగా ప్ర‌యాణించండి. దీనికి భార‌త ప్ర‌భుత్వ‌ అధికారులు మీకు ఎలాంటి స‌హాయం చేయ‌క‌పోవ‌డం విచార‌క‌రం. చ‌ట్టాలేవీ బండ‌రాళ్ల‌పై రాయ‌రు క‌దా. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో వాటిని మార్చుకోవాలి” అని ఘాటుగా కామెంట్ చేశారు.
  • మరొకవైపు ఎలాంటి స‌హాయం చేయ‌కుండా ఆ కుటుంబాన్ని అవ‌మానించారంటూ స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Source