చేతులకు నగలు వేసుకుని అడ్డంగా బుక్కైంది

  • గ్రాసరీ షాపులో 1800 డాలర్ల విలువైన సరుకును దొంగలించేందుకు ప్రయత్నించిన ఒక మహిళ అడ్డంగా బుక్కైన ఘటన అమెరికాలోని నెవెడా ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన ఏప్రిల్‌ 9న చోటుచేసుకుంది.
  • వివరాల్లోకి వెళితే.. నెవెడాకు చెందిన జెన్నిఫర్‌ వాకర్‌ అనే 53 ఏళ్ల మహిళ సరుకులు కొనడానికి కాలిఫోర్నియా గ్రాసరీ షాపుకు వెళ్లింది.
  • తనకు కావలిసిన సరుకులను కంటైనర్‌లో లోడ్‌ చేసిన జెన్నిఫర్‌ ఆ తర్వాత అక్కడే ఉన్న కొన్ని నగలను తన చేతులకు వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా బిల్‌ కౌంటర్‌ వద్దకు వచ్చింది.
  • అయితే బిల్లింగ్‌ చేస్తున్న సమయంలో జెన్నిఫర్‌ ముఖంలో ఆందోళన కనిపించడంతో షాపు యజమానికి అనుమానమొచ్చి ఆరా తీశాడు.
  • ఆమె సమాధానం చెప్పడానికి తటపటాయించడంతో క్రాస్‌చెక్‌ చేయాల్సిందిగా పనివాళ్లకు తెలిపాడు. దీంతో జెన్నిఫర్‌ను తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో జెన్నిఫర్‌ చేతులకు వేసుకున్న నగలను లాక్కొని పోలీసులకు సమాచారమందించాడు.
  • పోలీసులు అక్కడికి చేరుకొని జెన్నిఫర్‌ వాకర్‌పై దొంగతనం చేయడమే గాక వాటిని అపరించేందుకు ప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేసి ఎల్ డొరాడో కౌంటీ జైలుకు తరలించారు.
  • కాగా జెన్నిఫర్‌ బెయిల్‌కు అప్లై చేసుకోవాలంటే 10వేల డాలర్లు చెల్సించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

Source