అమెరికాలో నెల్లూరు యువకుడిపై కాల్పులు

  • అమెరికాలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  • వివరాల్లోకి వెళితే మనుబోలు మండలం మడమనూరుకు చెందిన డేగా ధీరజ్‌ రెడ్డి ఇటీవల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
  • చికాగోలోని సెయింట్‌ లూయీస్‌కు  ఓ పని నిమిత్తం వెళ్లి అక్కడ సెల్లార్‌లో కారును పార్కింగ్‌ చేస్తుండగా నల్ల జాతీయులు అతడిపై తుపాకులతో కాల్పులు జరిపారు.
  • తీవ్ర గాయలపాలైన ధీరజ్‌ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఏప్రిల్‌ 9న చోటుచేసుకుంది. కాగా ప్రస్తుతం ధీరజ్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
  • ధీరజ్‌ ఉదర భాగం ఎడమ వైపు నుంచి శరీరంలోకి ప్రవేశించిన బుల్లెట్ కుడి వైపున పేగు, కాలేయాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద ఉన్న అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
  • ధీరజ్‌ శరీరంలో బులెట్‌ ఇంకా అలాగే ఉండిపోవడంతో  శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు.
  • కాగా ధీరజ్‌ రెడ్డి హార్ట్‌ బీట్‌, బీపీ లెవల్స్‌ గత రాత్రితో పోలిస్తే సాధారణంగా ఉండడంతో  అతడు త్వరగా కోలుకుంటాడని మిత్రలు ఆకాంక్షిస్తున్నారు.
  • మరోవైపు ధీరజ్‌ రెడ్డిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
  • మరోవైపు ధీరజ్‌ త్వరగా కోలుకోవాలంటూ గో ఫౌండ్‌ మీ అనే సంస్థ మద్దతుగా నిలిచింది. ‘అతను త్వరగా కోలుకోవాలని  మెసేజ్‌లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీ మద్దతు ఉండాలంటూ’ గో ఫౌండ్‌ సంస్థ పేర్కొంది.

Source