ఏపీలో 420కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

  • రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు నిర్వహించిన పరీక్షల్లో 15 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది.
  • గుంటూరు జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2, కడప జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో మరో మరణం నమోదైంది.
  • దాంతో ఇప్పటివరకు కరోనాతో ఏడుగురు మరణించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కేసులు వెల్లడి కాగా, గుంటూరు జిల్లా 82 కేసులతో రెండో స్థానంలో ఉంది.
  • విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో కరోనా కేసులేమీ లేవు.

Source