ఈ వారంలో నాకు నచ్చిన ‘పిక్’ ఇదీ!: మంత్రి కేటీఆర్

  • ‘కరోనా’ కట్టడికి పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల్లో ఒకటి సామాజిక దూరం పాటించడం.
  • ఈ విషయాన్ని ప్రభుత్వం, వైద్య శాఖ సహా పలు శాఖల అధికారులు ప్రజలకు తరచుగా చెబుతూనే ఉన్నారు.
  • అయినప్పటికీ ఈ నిబంధనను పెడచెవిన పెట్టిన పెద్దలూ లేకపోలేదు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేశారు.
  • ‘ఈ వారంలో నాకు నచ్చిన చిత్రం’ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోలో సామాజిక దూరం పాటిస్తూ ఓ దుకాణం ముందు చిన్నారులు నిలబడి ఉండటం కనబడుతుంది.
  • ఓ చిన్నారి ఆ దుకాణంలో ఏదో కొనుగోలు చేస్తుండగా, మిగిలిన నలుగురు సామాజిక దూరం పాటిస్తూ బయట నిలబడి ఉండటం గమనించవచ్చు.
  • ‘సోషల్ డిస్టెన్స్’ పాటించడం అనే కళను పెద్దలకు చిన్నారులు బోధిస్తున్నారంటూ వారిపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.

Source