ఆపరేటర్ ఎవరైనా ఇక సెట్ టాప్ బాక్సు ఒకటే.. ట్రాయ్ కీలక నిర్ణయం

  • దేశంలో బుల్లితెర ప్రేక్షకుల వినియోగార్థం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది.
  • దేశంలో ఇప్పటివరకు ఒక్కో డీటీహెచ్ ఆపరేటర్ తమకంటూ ప్రత్యేకమైన సెట్ టాప్ బాక్సులను వినియోగదారులకు ఇస్తుండేవారు.
  • ఇకపై ఆ విధానం పోవాలని, ఆపరేటర్ ఎవరైనా సెట్ టాప్ బాక్సు ఒకటే ఉండాలని ట్రాయ్ నిర్ణయించింది.
  • ఒకే బాక్సుతో తనకు ఇష్టమైన ఆపరేటర్ ను ఎంచుకునే సౌలభ్యం వినియోగదారుడికి ఉండాలని ట్రాయ్ భావిస్తోంది.
  • ఇకమీదట అలాంటి సెట్ టాప్ బాక్సులనే వినియోగదారులకు ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీచేయాలంటూ ట్రాయ్ సిఫారసు చేసింది.
  • అందుకోసం డీటీహెచ్ కంపెనీలకు ఆర్నెల్ల గడువు ఇవ్వాలని, ఈ సెట్ టాప్ బాక్సులు విధిగా యూఎస్ బీ ఆధారిత కనెక్షన్ తో కూడా పనిచేసేలా ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది.

Source