కొత్త కేసులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి: ఐసీఎంఆర్

  • భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
  • ప్రస్తుతానికి దేశంలో కరోనా వ్యాప్తి రెండో దశలోనే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతుండగా, కొత్త కేసులు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంటోంది.
  • విదేశీ ప్రయాణ చరిత్ర లేకపోయినా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, వారు కరోనా వ్యక్తులను కలిసిన దాఖలాలు కూడా లేవని, అయినప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతోందని ఐసీఎంఆర్ వివరించింది.
  • శ్వాస సంబంధ వ్యాధి ఉన్నవారికీ కరోనా సోకుతున్నట్టు వెల్లడైందని తెలిపింది. 104 కేసుల్లో 40 వరకు ఇలాంటి కేసులే ఉన్నాయని, దేశంలో కరోనా విస్తరణ మూడో దశకు చేరుకుంటోందన్న అనుమానాలకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
  • దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విభేదిస్తోంది. అలాంటిదేమీ లేదని, 3వ దశకు వస్తే ముందుగానే హెచ్చరిస్తామని ప్రకటించింది.

Source