ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబై ‘ధారావి’లో కలకలం.. 43 మందికి కరోనా పాజిటివ్‌!

  • మహమ్మారి కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై ధారావిలో కలకలం రేగుతోంది.
  • ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని ‘ధారావి’లో దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటారు.
  • ఈ ప్రాంతంలో ఇటీవల కరోనాతో ఓ వ్యక్తి మరణించడంతో అధికారులు అప్రమత్తమైన విషయం తెలిసిందే.
  • ధారావిలో ప్రజలకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరిన్ని పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
  • ధారావిలో కొవిడ్-19 కేసులు 43కు చేరుకున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు చెప్పారు.
  • ఇప్పటికే ధారవి చుట్టూ బారికేడ్‌లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
  • అక్కడ ఐసోలేషన్, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.
  • ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తి మొదలైతే దాన్ని నిరోధించడం కష్టమైన పనని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ అక్కడ మరో కరోనా కేసు నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది.

Source