బోయపాటి సినిమాలో లేడీ విలన్ గా భూమిక… బాలయ్యతో పోరుకు రెడీ!

  • బాలకృష్ణతో గతంలో ‘సింహా’, ‘లెజండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన బోయపాటి శ్రీను, తాజాగా, హ్యాట్రిక్ కొట్టేందుకు మరో సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
  • బోయపాటి సినిమాల్లో హీరోకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, విలన్ కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి సినీ ప్రేక్షకులకు తెలిసిందే.
  • ఇక, తాను బాలయ్యతో తీయబోయే సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉండగా, ఆ పాత్రకు నటి భూమికను తీసుకోవాలని బోయపాటి భావించారని, ఈ మేరకు ఆయన టీమ్, ఇప్పటికే ఆమెను సంప్రదించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
  • భూమిక ఈ పాత్రకు అంగీకరిస్తే, వెంటనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.
  • ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ లేకుండా ఉంటే, వారణాసిలో సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ పాటికే పూర్తయి ఉండేది.
  • కాగా, బాలయ్య నటించిన ‘రూలర్’ చిత్రంలో భూమిక ఓ ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Source