ఐపీఎల్ జరుగకుంటే ధోనీ ‘ఖేల్’ ఖతమే: కృష్ణమాచారి శ్రీకాంత్

  • ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీలు జరుగకుంటే, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, టీ-20 వరల్డ్ కప్ కు ఎంపికై, మరోసారి దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు దాదాపు మృగ్యమేనని సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
  • శనివారం నాడు ఓ టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ధోనీ విషయంలో తాను ఆచితూచి మాత్రమే స్పందించాలని భావించడం లేదని, ఐపీఎల్ పోటీలు రద్దయితే, అతనికి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు అత్యంత స్వల్పమేనని వ్యాఖ్యానించారు.
  • ప్రస్తుత పరిస్థితుల్లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా రిషబ్ పంత్ సరిగ్గా సరిపోతాడని, కేఎల్ రాహుల్ సైతం తన మదిలో ఉన్నాడని తెలిపిన శ్రీకాంత్ తానైతే రిషబ్ వైపే మొగ్గుచూపుతానని, అతనిలో టాలెంట్ ఎంతో ఉండటమే ఇందుకు కారణమని అన్నారు.
  • ఐపీఎల్ పోటీలు జరుగకుంటే, అసలు ధోనీ పేరు తన మనసులోకే రాదని స్పష్టం చేశారు.

Source