లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్.. భారత క్రికెటర్‌కి రూ. 500 జరిమానా

  • లాక్‌డౌన్ రూల్స్‌ బ్రేక్ చేసిన భారత క్రికెటర్ రిషి ధావన్‌కి రూ. 500 జరిమానా పడింది.
  • హిమాచ‌ల్‌ప్రదేశ్‌‌కి చెందిన రిషి ధావన్.. తాజాగా తన సొంత కారులో బ్యాంక్ పని మీద రోడ్డుపైకి వచ్చాడు.
  • దీంతో.. అతడి కారుని ఆపిన పోలీసులు.. లాక్‌డౌన్ రూల్స్‌‌ని అతిక్రమించినందుకు రూ. 500 జరిమానా విధించారు.
  • వాస్తవానికి రిషి ధావన్ రిలాక్సేషన్ పీరియడ్ (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట) టైమ్‌లోనే ఇంటి వెలుపలికి వచ్చాడు.
  • కానీ.. అతని కారుకి ఎలాంటి వెహికల్ పాస్ లేకపోవడంతో పోలీసులు జరిమానా విధించారు. దీంతో.. అక్కడే జరిమానా కట్టేసి.. రిషి ధావన్ కారులో వెళ్లిపోయినట్లు తెలిసింది.

Source