సచిన్ లో అంత సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదు: హర్భజన్ సింగ్

  • భారత క్రికెట్ చరిత్రలో 2011 వరల్డ్ కప్ ఓ మధురానుభూతి.
  • మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా ముంబయి వాంఖెడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసి వరల్డ్ కప్ అందుకుంది.
  • ఈ విజయం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
  • ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఏం జరిగిందో నాటి జట్టులో సభ్యుడైన హర్భజన్ సింగ్ తాజాగా వివరించాడు.
  • “సచిన్ డ్యాన్స్ చేయడాన్ని ఆ రోజే మొట్టమొదటిసారి చూశాను. చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోనంతగా సచిన్ సంతోష సాగరంలో తేలియాడాడు. ప్రతి ఒక్కరితో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ వెల్లడించాడు.
  • శ్రీలంకతో ఫైనల్ లో గెలిచాక నాటి టీమిండియా సభ్యులు సచిన్ ను భుజాలపైకి ఎత్తుకుని స్టేడియం అంతా కలియదిరిగారు.

Source