భారత్‌ సాయం కోరిన అక్తర్‌

  • తమ దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి భారత్‌ సాయం చేయాలంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా సుపరిచితమైన షోయబ్‌ అక్తర్‌ విన్నవించాడు.
  • ప్రస్తుతం పాకిస్తాన్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవన్నాడు. ఈ విషయంలో తమను భారత్‌ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
  • ‘మాకు ప్రస్తుతం 10వేలకు పైగా వెంటిలేటర్లు అవసరం. వెంటిలేటర్లు లేక మా దేశం మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ విషయంలో సాయం చేయడానికి భారత్‌ ముందుకు రావాలి.
  • ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మానవతా కోణంలో మాకు సాయం చేయండి. మిగతా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌ చొరవచూపాలి. ఈ విషయంలో ఇరు దేశాలు ఏకం కావాలి’ అని అక్తర్‌ కోరాడు.
  • ఇప్పటివరకూ పాకిస్తాన్‌లో 4,263 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో సుమారు 60 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Source